Siluvato Sagindi Yatra | Latest Telugu Jesus Songs | Christian

సిలువలో సాగింది యాత్ర – కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే

Siluvato Sagindi Yatra | Latest Telugu Jesus Songs | Christian Song Info

Detailed information regaring song Siluvato Sagindi Yatra | Latest Telugu Jesus Songs | Christian.

Caption Detail

Song Video

Song Lyrics

సిలువలో సాగింది యాత్ర – కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే 1. పాలుగారు దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే 2. చెళ్ళుమని కొట్టింది ఒకరు ఆ మోముపై ఊసింది మరియొకరు బంతులాడినారు బాధలలో వేసినారు నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే 3. వెనుకనుంచి తన్నింది ఒకరు తనముందు నిలచి నవ్వింది మరియొకరు గేలిచేసినారు పరిహాసమాడినారు నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే 4. దాహమని అడిగింది ప్రేమ చేదు దాహాన్ని ఇచ్చింది లోకం చిరకనిచ్చినారు మరి బరిసెతో గుచ్చారు నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే

Download This Lyrics Now

Download Lyrics

Write a comment