CHITTAMMA SONG LYRICS
Presenting the Official Video Song of "Chittamma.." from 'KAALA'
CHITTAMMA SONG LYRICS Song Info
Detailed information regaring song CHITTAMMA SONG LYRICS.
Caption
Detail
Track
Chittamma
Singers
Ananthu
, Shweta Mohan
Lyricist
Vanamali
Song Video
Song Lyrics
పల్లవి:
పువ్వల్లె నా ప్రేమ తేనూరును
ఆ నింగి తేనెల్లు కురిపించును
చిట్టెమ్మ ... చిట్టెమ్మ ... కళ్ళల్లో ఏంటమ్మా..
ఆకాశమే లేక చిరుజల్లు ఉందా
ఏ గాయం ఎంతైనా అది మానిపోదా
చిట్టెమ్మ ... చిట్టెమ్మ ... కళ్ళల్లో ఏంటమ్మా..
చరణం 1:
నా దేహమంతా నీ ప్రేమతావే
కలాలూ ఏమార్చులే
ఎడమైన ప్రేమ తాకింది మంటై
దూరాలు పెరిగేనులే
నదిలాంటి ప్రేమే పయనాలు ఆపి
ఓ ఎండమావైనదే
కలలన్ని కరిగి చేజారగానే
కలతేమో బ్రతుకైనదే
చిట్టెమ్మ ... చిట్టెమ్మ ... కళ్ళల్లో ఏంటమ్మా..
ఆకాశమే లేక చిరుజల్లు ఉందా
ఏ గాయం ఎంతైనా అది మానిపోదా
చరణం 2
ఏ తీగ వీణా పలికించకుండా
రాగాలు వినిపించదే
శిశిరాన వాడే చిగురాకులాగా
నా ప్రేమ మోడైనదే
ఏ జాలి లేని విధిరాత కూడా
చేసింది ఈ గాయమే
ముడి వేయకుండా ముగిసింది నాడే
ఈ ప్రేమ అధ్యాయమే
చిట్టెమ్మ ... చిట్టెమ్మ ... కళ్ళల్లో ఏంటమ్మా..
ఆకాశమే లేక చిరుజల్లు ఉందా
ఏ గాయం ఎంతైనా అది మానిపోదా
చిట్టెమ్మ ... చిట్టెమ్మ ... కళ్ళల్లో ఏంటమ్మా..
Track : Chittamma Singers : Ananthu , Shweta Mohan Lyricist : Vanamali
Write a comment