Bapu gari bommo
Song Name : Bapu Gari Bommo Banner : Sri Venkateswara Cine Chitra India Pvt. Ltd. Producer : B.V.S.N.Prasad Director : Trivikram Star Cast : Pawan Kalyan, Samantha, Pranitha Music : Devi Sri Prasad Lyrics Writer: Ramajogayya Shastry Singer : Shankar Mahadevan
Bapu gari bommo Song Info
Detailed information regaring song Bapu gari bommo.
Caption
Detail
Song Name
Bapu Gari Bommo
Banner
Sri Venkateswara Cine Chitra India Pvt. Ltd.
Producer
B.V.S.N.Prasad
Director
Trivikram
Star Cast
Pawan Kalyan, Samantha, Pranitha
Music
Devi Sri Prasad
Lyrics Writer
Ramajogayya Shastry
Singer
Shankar Mahadevan
Song Video
Song Lyrics
బొంగరాలంటి కళ్ళు తిప్పింది
ఉంగరాలున్న జుట్టు తిప్పింది
గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పింది
అమ్మో బాపుగారి బొమ్మో ఓలమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో
రబ్బరు గాజుల రంగు తీసింది రాసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలిపటంలా
నన్నెగరేసింది
అమ్మో దాని చూపు గమ్మో
ఓలమ్మో ఓల్డు మాంకు రమ్మో
పగడాల పెదవుల్తో పడగొట్టింది పిల్ల
కత్తులు లేని యుద్ధం చేసి
నన్నే గెలిచింది
ఏకంగా ఎదపైనే నర్తించింది అబ్బ
నాట్యంలోని ముద్దర చేసి
నిద్దర నాదే పోయింది
అమ్మో బాపుగారి బొమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో
మొన్న మేడ మీద బట్టలారేస్తూ
కూనిరాగమేదో తీసేస్తూ
పిడికెడు ప్రాణం పిండేసేలా
పల్లవి పాడిందే పిల్లా
నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ
నాజూకైన వేళ్ళు తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుతీగై
ఒత్తిడి పెంచిందే మళ్ళా
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది
ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుంది
పూలలో గుచ్చే దారం
నా గుండెల్లో గుచ్చేసింది
చీర చెంగు చివరంచుల్లో
నన్నే బందీ చేసింది
పొద్దు పొద్దున్నే హల్లో అంటుంది
పొద్దుపోతే చాలు కల్లో కొస్తుంది
పొద్దస్తమానం పోయినంత
దూరం గుర్తొస్తుంటూంది
అమ్మో బాపుగారి బొమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో
ఏమాయా లోకంలోనో నను మెల్లగ తోసేసింది
తలుపులు మూసింది తాళం పోగొట్టేసింది
ఆ మబ్బుల అంచులదాకా
నా మనసును మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది
తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది
అందమే గంధపు గాలిగ మళ్ళీ ఊపిరి పోసింది
తియ్యని ముచ్చటలెన్నో ఆలోచనో అచ్చేసింది
ప్రేమనే కళ్ళద్దాలు చూపులకే తగిలించింది
కోసల దేశపు రాజకుమారి
ఆశలు రేపిన అందాల పోరి
పూసల దండలో నన్నే
గుచ్చి మెళ్ళో వేసింది
అమ్మో బాపుగారి బొమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో
Song Name : Bapu Gari Bommo Banner : Sri Venkateswara Cine Chitra India Pvt. Ltd. Producer : B.V.S.N.Prasad Director : Trivikram Star Cast : Pawan Kalyan, Samantha, Pranitha Music : Devi Sri Prasad Lyrics Writer : Ramajogayya Shastry Singer : Shankar Mahadevan
Write a comment