Vayyarala jabilli
Movie : Teenmaar Director : Jayanth C. Paranjee Cast : Pawan Kalyan, Kriti Kharbanda Song : Vayyarala jabilli Singer : Karunya Lyrics : Rahaman Music : Mani Sharma
Vayyarala jabilli Song Info
Detailed information regaring song Vayyarala jabilli.
Caption
Detail
Movie
Teenmaar
Director
Jayanth C. Paranjee
Cast
Pawan Kalyan
, Kriti Kharbanda
Song
Vayyarala jabilli
Singer
Karunya
Lyrics
Rahaman
Music
Mani Sharma
Song Video
Song Lyrics
పల్లవి:
వయ్యారాల జాబిల్లీ ఓణీ కట్టీ
గుండెల్లోనా చేరావే గంటేకొట్టీ
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టీ
కవ్వింతల్లో ముంచావే కళ్ళేమీటీ
నదివలె కదిలా నిలబడతా
కలలను వదిలా నినువెతకా
వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే
పరుగే జతను అడిగినదే
అలలై తపన తడిపినదే || వయ్యారాల ||
చరణం 1:
నీ పరిచయమే ఓ పరవశమై
జగాలు మెరిసెనులే
నా ఎద గుడిలో నీ అలికిడినీ
పదాలు పలుకవులే
అణువణువూ చెలిమి కొరకూ
అడుగడుగూ చెలికి గొడుగూ
ఇది వరకూ గుండె లయకూ
తెలియదులే ఇంత పరుగూ
వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే || వయ్యారాల ||
చరణం 2:
నీ ప్రతి తలపూ నాకొక గెలుపై
సుఖాలు తొణికెనులే
నీ శృతి తెలిపే కోయిల పిలుపే
తథాస్తు పలికెనులే
గగనములా మెరిసి మెరిసీ
పవనములా మురిసి మురిసీ
నిను కలిసే క్షణము తలచీ
అలుపు అనే పదము మరచీ
వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే || వయ్యారాల ||
Movie : Teenmaar Director : Jayanth C. Paranjee Cast : Pawan Kalyan , Kriti Kharb , a Song : Vayyarala jabilli Singer : Karunya Lyrics : Rahaman Music : Mani Sharma
Write a comment