Ee Roje Thelisindi
Ee Roje Thelisindi Video Song - Idiot Movie
Ee Roje Thelisindi Song Info
Detailed information regaring song Ee Roje Thelisindi.
Caption
Detail
Song Video
Song Lyrics
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన
నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా
నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా
కను రాల్చే కన్నీరువా నను చేరే పన్నీరువా
నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన
కన్నులలోనా వెన్నెలలోనా నీ రూపు తోచే
ఊహలలోనా ఊసులలోనా నీ ఆశలే నాలో నీ బాసలే
తొలిసారిట సిగ్గేస్తుంది మొగ్గేస్తుంది తనువంతా
అపుడపుడు తడిమేస్తోంది తడిపేస్తోంది మధువుల వాన
ఆనందమై నాలో అనుబంధమై నీ ప్రేమ నను చేరి వణికించెరా
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన
ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా
వికసించే కుసుమం నేనై నిను తాకనా నీలో సడి చేయనా
పని చేస్తే పక్కన చేరి సందడి చేస్తూ గుసగుసలే
పడుకుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే
సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమా కనువిందు పండించెరా
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిలో మల్లెల వాన
నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా
నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా
కను రాల్చే కన్నీరువా నను చేరే పన్నీరువా
నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా
Write a comment