పాడనా తీయగా కమ్మని ఒకపాట

Vasu Telugu Movie Songs | Padana Theeyaga Video Song |

పాడనా తీయగా కమ్మని ఒకపాట Song Info

Detailed information regaring song పాడనా తీయగా కమ్మని ఒకపాట.

Caption Detail

Song Video

Song Lyrics

నీ జ్ఞాపకాలే నన్నే తరిమెనే
నీకోసం నేనే పాటై మిగిలానే
చెలియా చెలియా... ఓ... చెలియా...

పాడనా తీయగా కమ్మని ఒకపాట
పాటగా బతకనా మీ అందరినోట
ఆరాధనే అమృతవర్షం అనుకున్నా
ఆవేదనే హాలాహలమై పడుతున్నా
నా గానమాగదులే ఇక నా గానమాగదులే ||పాడనా||

గుండెల్లో ప్రేమకే...
గుండెల్లో ప్రేమకే గుడి కట్టేవేళలో
తనువంతా పులకించే
వయసంతా గిలిగింతే
ప్రేమించే ప్రతిమనిషీ ఇది పొందే అనుభూతే
అనురాగాల సారం జీవితమనుకుంటే
అనుబంధాల తీరం ఆనందాలుంటే
ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే ||2|| ||పాడనా||

ఆకాశం అంచులో...
ఆకాశం అంచులో ఆవేశం చేరితే
అభిమానం కలిగెనులే
అపురూపం అయ్యెనులే
కలనైనా నిజమైనా కనులెదుటే ఉన్నావే
కలువకు చంద్రుడు దూరం... ఓ నేస్తం
కురిసే వెన్నెల వేసే ఆ బంధం
ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే ||2|| ||పాడనా||

Related posts

Write a comment