Shiva Poojaki
Swarna Kamalam - Telugu Songs - Shiva Poojaki
Shiva Poojaki Song Info
Detailed information regaring song Shiva Poojaki.
Caption
Detail
Song Video
Song Lyrics
శివ పూజకు చివురిన్చిన సిరి సిరి మువ్వా
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా
యథిరాజుకి జ తి స్వరముల పరిమళమివ్వా
నటనాంజలితో బ్రతుకుని తరించనీవా
పరుగాపక పయనించవే తలపుల నావా
కెరటాలకు తలవంఛితే తరగదు త్రొవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరిన్చిరావా
1|| పడమర పడగల పై మెరిసే తారలకై
రాత్రిని వరిన్చకె సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపిన్చె..కాన్థులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నిదురించిన హ్రుదయరవళి ఓంకారం కానీ
2|| తనవెళ్ళె సంకెళ్లై కదల లేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తూ ఆగి పోకు ఎక్కడా..
అవధిలేని అందముంది అవనికి నలు దిక్కుల..
ఆనందపు గాలి వాలు నడప నీ నిన్నీలా
ప్రతి రొజొక నవగీథిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా ||ప||
3|| జలిథ చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిథ కిరణ కలితమ్ నీ సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయం లో
వికసిథ శతదళ శొభల సువర్ణ కమలం
Write a comment