PUTHADI BOMMA PORI NEW FOLK SONG
lyrics:Raj kumar pogula (76748 99165) Music:Gl Namdev Singers:Nagalaxmi &Boddu dilip kumar Dop&direction:Badri irmulak DI:Sanjeev Mamidi(HYD) Cast:Suresh Babu&Ravali Producer:kondapur Raju Technical Advisor : Telangana Talent Dinesh {DJ REDDY}
PUTHADI BOMMA PORI NEW FOLK SONG Song Info
Detailed information regaring song PUTHADI BOMMA PORI NEW FOLK SONG.
Caption
Detail
lyrics
Raj kumar pogula (76748 99165)
Music
Gl Namdev
Singers
Nagalaxmi
, Boddu dilip kumar
Dop&direction
Badri irmulak
DI
Sanjeev Mamidi(HYD)
Cast
Suresh Babu&Ravali
Producer
kondapur Raju
Technical Advisor
Telangana Talent Dinesh {DJ REDDY}
Song Video
Song Lyrics
మత్తడి దూకే దారి మందార తోటలోకి
పుత్తడి బొమ్మ పోరి అందాల యువరాణి
నవ్వుల సిరి మల్లేవే ఓ పిల్లా
కన్నుల జాబిల్లీవే ... అరే..
నవ్వుల సిరి మల్లేవే ఓ పిల్లా
గుండెల తొలి పొద్దువే
మసక పొద్దులాయే ఉసికేల బాటలాయే
మూల మలితవ్వా మందలీకు ఈ వేళ
మాటల పుట్టలతోని ఓ పిలగా
బాటల కాపు గాయకూ నువ్వలగా
మాటల పుట్టలతోని ఓ పిలగా
మలుపకు నా మనసును నువ్వలగ
1. ఖైది సికట్ల కదిలేటి వెన్నెలమ్మ
నిద్దుర కన్నుల్లా దూకేటి కళల బొమ్మ
బంగరు బంతి రెక్కవే ఓ పిల్లా
గుండెల తేనె సుక్కవే ...అరే..
బంగరు బంతి రెక్కవే ఓ పిల్లా
కన్నుల కలువ మొగ్గవే
అరక దున్నేయాల ఆల మంద తొవ్వల్లా
అలికిడి లేని ఈడ ఆగమాగం చేయకలా
మాటల గారడీతోనీ ఓ పిలగా
సూపుల సవ్వడి చేయకూ నువ్వలగా
మాటల గారడీ తోని ఓ పిలగా
గుండెల కలిసేయకు నువ్వలగా
2.కను మబ్బుల్లోన దాగీన ఎన్నెలమ్మ
కరు సికట్లలోన పూసేటి నా కలువ
కన్నుల నది పైన్నే...ఓ పిల్లా
కాసే ఎన్నెల నువ్వే...అరే ..
కన్నుల నది పైన్నే ...ఓ పిల్లా
తేలే సిన్ని పడువవే...
మాటల తీగకు సుట్టకూ నా మనసు
కన్నుల చూపుకు ఎరుగనా నీ తీరు
ఊరిల్ల మాటలతో నీ ..ఓ పిలగా
ఆశలు సూపామాకు నువ్వలగా
ఊరిల్ల మాటలతో నీ ..ఓ పిలగా
కరుగదు నా మనసూ నికలగా
3. నింగిలోని పాలపుంత నిండినాది గుండె సేంత
కన్నుల ఊటల్లో కాసేనా కనుల పంట
గుండె వాకిట్లోనే ...ఓ..పిల్లా
సిగ్గుల సిరి ముగ్గువే ....అరే..
గుండె వాకిట్లోనే ..ఓ..పిల్లా
సితురాల సినుకు జాడవే..
ఏసవి ఎండమావి నీ మాటల తీరుగాని
కోతల ఓ మనిషి అమావాస్య చంద్రుడివి
గాలిల మేడలు గట్టీ ..ఓ..పిలగా
గారడి చెయ్యకు నువ్వు ఓ పిలగా
గాలిల మేడలు గట్టీ ...ఓ..పిలగా
గుండెల పిలువకు నన్నూ నువ్వలగా
గాలిల మేడలు గట్టీ ...ఓ...పిలగా
గుండెల పిలువకు నన్నూ నువ్వలాగా..
lyrics : Raj kumar pogula (76748 99165) Music : Gl Namdev Singers : Nagalaxmi , Boddu dilip kumar Dop&direction : Badri irmulak DI : Sanjeev Mamidi(HYD) Cast : Suresh Babu&Ravali Producer : kondapur Raju Technical Advisor : Telangana Talent Dinesh {DJ REDDY}
Write a comment