ఏ పిల్లా అట్లా నవ్వేసేసి పారిపోమాకే బాబు...
మీరేంట్రా నన్ను జూత్తున్నారు...
ఎవడిడప్పు వాడు కొట్టండహే..
అది..ఓయ్..హెయ్
ఏ గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా...
ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా..
ఏ గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా...
ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా..
ఏ సుందరీ సుందరీ సుందరీ మనసుని చేసినావె ఇస్త్రీ
స్ట్రాబెర్రీ బ్లూ బెర్రీ బ్లాక్ బెర్రీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావె ఫ్రెంచ్ జ్యూస్ ఫ్యాక్టరీ
పిల్లా నువ్వు లేని జీవితం నల్లరంగు అంటుకున్న తెల్లా కాగితం..
ఎహ పిల్లా నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంటే దారుణం
ఏ గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా...
ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా..
1)
పంచదార పెట్టి రుద్దినట్టు.. మంచి తేనె తెచ్చి అద్దినట్టు
ద్రాక్షపండు తీసి పిండినట్టు ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ
వెయ్యి ముగ్గు చుక్కలెట్టినట్టు విన్నాంలే
పొయ్యి మీద పాలు పొంగినట్టు విన్నాంలే
పూటకొక్క పండగొచ్చినట్టు
ఏదేదో అవుతాందే నీ మీద ఒట్టు
సంపకే సంపకే సంపకే నిప్పులాంటి నవ్వులోకి దింపకే...
ఏ సింపకే సింపకే సింపకే నల్లని రాత్రినే సింపకే
రంగుతో నింపకే
పిల్లా నువ్వు లేని జీవితం బ్రేక్ లేని బైకునే రయ్యి మంటూ తోలడం బ్..ర్..
ఎహె పిల్లా నువ్వు లేని జీవితం ట్రాక్ లేని ట్రైను మీద కుయ్యిమంటు ఎల్లడం..చిక్ చిక్ చిక్కు కూ..చిక్కు చిక్కు చిక్కు చిక్కు
2)
ఒక్క జానెడంత కప్పు కోసం పెద్ద ఓల్డ్ కప్పు జరుగుతాది
నీ నవ్వులున్న లిప్పు కోసం చిన్న ఓల్డ్ వారు జరిగినా తప్పు లేదే
కొన్ని వేలకోట్ల అప్పు కోసం కాపు కాసి ఉన్నదంట దేశం
ఒక్క నవ్వునంట ఇవ్వు పాపం దాన్ని అమ్ముకుంటే అప్పు బాధ తప్పుతాదే..
ఏయ్ కొట్టినా కొట్టినా కొట్టినా గుండెలోన దాగివున్న డప్పునీ
రాసినా రాసినా రాసినా నవ్వుపై ఎవ్వరూ రాయనీ మస్తు మాసు పాటనీ
పిల్లా నువ్వు లేని జీవితం తాడు లేని బొంగారాన్ని గిర్రుకుంటు తిప్పడం..ఏ
ఎహె పిల్లా నువ్వు లేని జీవితం నూనెలోంచి వానలోన జారిపడ్డ అప్పడం
ఓయ్ హెయ్ అయ
ది ఏయ్ పిల్లా..
Write a comment