Khadgam Movie || Nuvvu Nuvvu Video Song || Srikanth || Sonali Bendre || #Khadgam
nuvvu nuvvu nuvvenuvvu nuvvu nalone nuvvu nathone nivvu na chuttu nuvvu nen antha
Khadgam Movie || Nuvvu Nuvvu Video Song || Srikanth || Sonali Bendre || #Khadgam Song Info
Detailed information regaring song Khadgam Movie || Nuvvu Nuvvu Video Song || Srikanth || Sonali Bendre || #Khadgam.
Caption
Detail
Song Video
Song Lyrics
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నాలోనే నువ్వు
నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు
నేనంతా నువ్వు
నా పెదవిపైనా నువ్వు
నా మెడవంపున నువ్వు
నా గుండె మీదా నువ్వు
ఒళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వూ మొగ్గల్లే నువ్వు
ముద్దేసే నువ్వూ
నిద్దర్లో నువ్వూ పొద్దుల్లో నువ్వు
ప్రతినిమిషం నువ్వూ నువ్వు నువ్వు
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నా వయసుని వేధించే
వెచ్చదనం నువ్వు
నా మనసుని లాలించే
చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే
పచ్చిదనం నువ్వు
బయట పడాలనిపించే
పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వూ
నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వూ నువ్వూ
మెత్తని ముళ్ళే గిల్లే
తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వూ
నువ్వూ ఊ నువ్వూ
నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నా సిగ్గుని దాచుకొనే
కౌగిలివే నువ్వు
నావన్నీ దోచుకొనే
కోరికవే నువ్వు
మునిపంటితొ నను గిచ్చే
నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే
నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వూ
నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వూ నువ్వూ
తియ్యని గాయం చేసే
అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వూ నువ్వూ ఊ నువ్వూ
నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
మైమరపిస్తూ నువ్వు
మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరుజన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు
కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని
నా కొత్త పేరు నువ్వు
నా అందం నువ్వూ
ఆనందం నువ్వు
నేనంటే నువ్వూ
నా పంతం నువ్వూ
నా సొంతం నువ్వు
నా అంతం నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
Write a comment