Aaradugula bullet
Song Name: Aaradugula Bullet Movie Name: Attarrintiki Daaredi Banner: Sri Venkateswara Cine Chitra India Pvt. Ltd. Producer: B.V.S.N.Prasad Director: Trivikram Cast: Pawan Kalyan, Samantha, Pranitha Music : Devi Sri Prasad Lyrics : Sree Mani Song Name: Aaradugula Bullet Movie Name: Attarrintiki Daaredi Banner: Sri Venkateswara Cine Chitra India Pvt. Ltd. Producer: B.V.S.N.Prasad Director: Trivikram Cast: Pawan Kalyan, Samantha, Pranitha Music : Devi Sri Prasad Lyrics : Sree Mani Singers : Vijay Prakash, M.L.R. Karthikeyan
Aaradugula bullet Song Info
Detailed information regaring song Aaradugula bullet.
Caption
Detail
Song Name
Aaradugula Bullet
Movie Name
Attarrintiki Daaredi
Singers
Vijay Prakash
, M.L.R. Karthikeyan
Song Video
Song Lyrics
గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన
నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన
నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమే
తనవాసం వనవాసం
భైరవుడో భార్గవుడో
భాస్కరుడో మరి రక్కసుడో
ఉక్కు తీగ లాంటి ఒంటి నైజం
వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం
రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో
శత్రువంటూ లేని వింత యుద్ధం
గుండెలోతు గాయమైన శబ్దం
నడిచొచ్చే నర్తన శౌరి....
పరిగెత్తే పరాక్రమ శైలి
హాలాహలం భరించిన ధగ్ధ హృదయుడో
వీడారడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు
చరణం:1
దివి నుంచి భువి పైకి
భగ భగమని కురిసేటి
వినిపించని కిరణం చప్పుడు వీడు
వడి వడిగా వడగళ్ళై
దడ దడ మని జారేటి
కనిపించని జడి్వానేగా వీడు
శంఖంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు
శోకాన్నే దాటేసే అశోకుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు
చరణం:2
తన మొదలే ఒదులుకొని
పైకెదిగిన కొమ్మలకి
చివురించిన చోటుని చూపిస్తాడు.
తన దిశనే మార్చుకొని
ప్రభవించే సూర్యుడికి
తన తూరుపు పరిచయమే చేస్తాడు
రావణుడొ రాఘవుడొ
మనసులు దోచే మాధవుడో
సైనికుడో శ్రామికుడో
అసాధ్యుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు
Song Name : Aaradugula Bullet Movie Name : Attarrintiki Daaredi Singers : Vijay Prakash , M.L.R. Karthikeyan
Write a comment